- ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్
జగిత్యాల/ కోరుట్ల, వెలుగు: కేటీఆర్‌పై డ్రగ్స్ పెడ్లర్, డ్రగ్స్ సప్లయర్ కేసులు పెట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికలపై జగిత్యాల, కోరుట్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట వాస్తవమేనని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి నిజాయతీగా వ్యవహరిస్తే నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లను జైల్లో పెట్టొచ్చన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనకు తండ్రితో సమానమని, ఆయన పట్ల కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరమని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే స్పష్టత లేదన్నారు.
సీఎం రేవంత్ ఏ పార్టీలో ఉన్నాడో కాంగ్రెస్ నాయకులకు కూడా అర్థం కావట్లేదని కామెం ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలను బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చమని చెప్పడం ఎందుకో ఆయనకే తెలుసన్నారు. పసుపు మద్దతు ధర ప్రస్తుతం క్వింటాల్‌కు దాదాపు 16 వేలు పలు కుతోందని, రైతులు ఆర్గానిక్ పంటల వైపు దృష్టిపెట్టాలని ఎంపీ సూచించారు.
