
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల నియామకాల్లో తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలకు చోటు దక్కింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను నియమిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. పరిశ్రమల కమిటీలో సభ్యులుగా మల్లు రవి(కాంగ్రెస్), అర్వింద్ ధర్మపురి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి(బీజేపీ) నియమితులయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల కమిటీలో గడ్డం వంశీ కృష్ణ(కాంగ్రెస్), కె.ఆర్. సురేశ్ రెడ్డి (బీఆర్ఎస్)కి చోటు దక్కింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీలో కడియం కావ్య(కాంగ్రెస్), బి. పార్థసారథి రెడ్డి (బీఆర్ఎస్).. పర్సొన్నెల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ కమిటీలో ఎం.రఘునందన్ రావు(బీజేపీ).. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీలో ఆర్. రఘురామ్ రెడ్డి(కాంగ్రెస్) నియమితులయ్యారు. అలాగే, కామర్స్ కమిటీలో సభ్యులుగా రేణుకా చౌదరి(కాంగ్రెస్).. విదేశీ వ్యవహారాల కమిటీలో డీకే అరుణ (బీజేపీ), కె. లక్ష్మణ్ (బీజేపీ).
ఎనర్జీ కమిటీలో కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్), హౌసింగ్, అర్బన్ వ్యవహారాల కమిటీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి(కాంగ్రెస్).. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కమిటీలో ఈటల రాజేందర్ (బీజేపీ).. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిటీలో అనిల్ కుమార్ యాదవ్(కాంగ్రెస్).. రక్షణ కమిటీలో డి. దామోదర్ రావు(బీఆర్ఎస్)కు చోటు దక్కింది.