గల్లీ ప్లేయర్లను.. నేషనల్ కు తీసుకెళ్తం.. కాకా టోర్నీ టార్గెట్ ఇదే.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

గల్లీ ప్లేయర్లను.. నేషనల్ కు తీసుకెళ్తం.. కాకా టోర్నీ టార్గెట్ ఇదే.. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • కరీంనగర్లో వరంగల్, నల్లగొండ మధ్య మ్యాచ్

కరీంనగర్/తిమ్మాపూర్, వెలుగు: గల్లీ క్రికెటర్లను నేషనల్ లెవల్​కు తీసుకెళ్లడం మంత్రి వివేక్ వెంకటస్వామి డ్రీమ్ అని, అదే లక్ష్యంతో కాకా మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు. ఐపీఎల్ మ్యాచ్​లను తలపించేలా కాకా మెమోరియల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టీ-20 క్రికెట్ పోటీలు జరుగుతున్నాయని ప్రశంసించారు. 

శనివారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో గల వెలిచాల జగపతిరావు మెమోరియల్ గ్రౌండ్ లో వరంగల్, నల్లగొండ జట్ల మధ్య మ్యాచ్​ను ఎంపీ వంశీకృష్ణ టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి వివేక్ సారథ్యంలో కాకా టీ-20 క్రికెట్​ టోర్నీ ఉత్సాహంగా సాగుతోందన్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 మ్యాచ్​లు నిర్వహించామని, ఇంకా 30కి పైగా మ్యాచ్​లు ఉన్నాయన్నారు. 

కరీంనగర్ లో కేడీసీఏ ప్రెసిడెంట్ ఆగంరావు నిర్మించిన గ్రౌండ్​ సూపర్​గా ఉందని కొనియాడారు. వరంగల్​, నల్లగొండ జట్ల మధ్య క్రికెట్​ మ్యాచ్​ ఉత్కంఠగా సాగింది. టాస్​ గెలిచిన వరంగల్ జట్టు మొదట బ్యాటింగ్​కు దిగింది. ఆ తరువాత బ్యాటింగ్​కు దిగిన నల్లగొండ జట్టు ఒక బాల్​ మిగిలి ఉండగా లక్ష్యాన్ని సాధించి విన్నర్​గా నిలిచింది. 

ఈ కార్యక్రమంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, కోశాధికారి బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్ పాల్గొన్నారు.