ప్రపంచ శాంతి పరిరక్షణలో.. భారత్ పాత్ర కీలకం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రపంచ శాంతి పరిరక్షణలో.. భారత్ పాత్ర కీలకం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: ప్రపంచ శాంతి పరిరక్షణలో భారత్‌‌‌‌ పాత్ర కీలకమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఐక్యరాజ్యసమితి అడ్వైజరీ కమిటీ చైర్ పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, యూఎన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఫైనాన్స్ కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్‌‌‌‌తో బుధవారం వంశీకృష్ణ సమావేశమయ్యారు. 

ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితి ఆర్థిక పరిస్థితి, శాంతి భద్రతా కార్యకలాపాల నిధులపై చర్చించారు. ప్రపంచ శాంతి పరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలక పాత్రను భారత ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి వ్యవస్థల్లో పారదర్శకత, సమర్థత వంటి అంశాలపై ఎంపీ వంశీకృష్ణ సూచనలు అందించారు. 

ఈ సమావేశం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా వినిపించేలా ముఖ్యమైన అడుగు పడినట్లయింది.