రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి : ఎంపీ కడియం కావ్య

రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వండి : ఎంపీ కడియం కావ్య
  • కేంద్రానికి ఎంపీ కడియం కావ్య వినతి

న్యూఢిల్లీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో  రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణకు రూ.100 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కడియం కావ్య కోరారు. బుధవారం జీరో అవర్​లో ఆమె మాట్లాడుతూ.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో 200 మిల్లీ మీటర్లకుపైగా వర్షం కురవడంతో 45 కాలనీలు నీట మునిగాయని,  పలు రహదారులు దెబ్బతిన్నాయని తెలిపారు.

 1,200 మందిని 12 పూనరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. అమృత్, -స్మార్ట్ సిటీల స్కీమ్స్ కింద చేపట్టిన డ్రైనేజీ పనులు 66% పూర్తికావడంతో బాధితులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు.