రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు బాగుండదు

రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు బాగుండదు

పనికి రాని మంత్రులను, అధికారులతో.. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని  సీఎం కేసీఆర్ ఢిల్లీ కి వెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ధాన్యం కొనుగోలు అంశంపై కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ఇందిరా పార్క్ దగ్గర వరి దీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్  అడగలేదని పీఎంవో ద్వారా తెలుకున్నానని అన్నారు.  డబ్బుపై, రాజకీయాలపై వున్న సోయి.. కేసీఆర్ కు రైతులపై లేదని ఆరోపించారు. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు బాగుపడదన్నారు.

హుజురాబాద్ లో దళిత బంధు ఓ లెక్కనా అన్న  కేసీఆర్.. రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు ఇచ్చుడే మరిచిండు అని అన్నారు. చంద్రబాబు.. కరెంట్ తీగల పై బట్టలు ఆరేసుకోవాలని అంటే..వైఎస్ఆర్  వచ్చాక ఉచిత కరెంట్ ఇచ్చారని తెలిపారు.

మేడ్చల్ మీటింగ్ లో తెలంగాణ ప్రజలు బాగుపడలేదని సోనియా ఆవేదన వ్యక్తం చేశారని.. కానీ కేసీఆర్  కుటుంబమే బాగుపడిందని చెప్పారు. దళితులకు.. 3 ఎకరాల భూమి, దళిత సీఎం అని చెప్పి.. నేనెందుకు అన్నా అని అంటున్నాడని అన్నారు. కెసిఆర్ జోకర్ లాంటి రాజకీయ నాయకుడన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కోసం సొంత పార్టీ నేతలను కూడా బెదిరించి తెస్తే.. కేసీఆర్  ఆగం చేస్తుండన్నారు. అన్నం పెట్టే అన్నదాత పాసిపోయిన అన్నం తింటున్నాడని చెప్పారు. నిరుద్యోగ యువత జాబ్స్ లేక చనిపోతున్నారని అన్నారు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యే లు 12 కోట్ల కార్లలో తిరుగుతున్నారని ఆరోపించారు. రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ వస్తుందని స్పష్టం చేశారు.

చంద్రబాబు.. హైటెక్ సిటి కట్టిండు.. కానీ రైతులను పట్టించుకోక పోవడం తో ఓడిపోయాడన్నారు. కేసీఆర్ పెన్షన్లు, రైతు బందు అని ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. లిక్కర్ రేట్లు పెంచి ఖజానా నింపుకుంటున్నాడని ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని కూడా కొనాలని.. తేమ శాతం పేరుతో మోసం చేస్తున్నారని... దాన్ని కూడా బంద్ చేయాలని డిమాండ్ చేశారు.