టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో దోపిడీ

టెస్టుల పేరుతో శంషాబాద్ విమానాశ్రయంలో దోపిడీ

శంషాబాద్ విమానాశ్రయంలో పరీక్షల పేరుతో దోపిడీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. యాంటిజెన్ టెస్ట్ కోసం రూ. 4,500/- వసూల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్ 377 కింద లోక్ సభలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.  ‘ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈ టెస్ట్ లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా టెస్ట్ తప్పనిసరి కావడంతో విధిలేని పరిస్థితుల్లో అధిక ధరలు చెల్లిస్తున్నారు. ఈ విషయాన్ని అనేక మంది ప్రయాణికులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ ఉన్నప్పటికీ ఈ పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి దోపిడీ నివారించాలి’ అని కోమటిరెడ్డి అన్నారు.