గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.10 లక్షలు : ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రూ.10 లక్షలు : ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి

వికారాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంట్​పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్​లుగా గెలిపిస్తే ఎంపీ నిధుల నుంచి ఆయా గ్రామాల అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానని ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్​ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కోకన్వీనర్ శేరి శ్రీధర్​రెడ్డి ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

బాత్రూమ్​క్లీనింగ్, రోడ్ల ప్యాచ్​వర్క్​చేసే, కోతులను పట్టుకునే ప్రత్యేక ట్రక్కులు తమ వద్ద ఉన్నాయని, వాటిని గ్రామాలకు పంపిస్తానన్నారు. అనంతరం జేకేఎంఆర్​సంస్థ ద్వారా అందించిన కోతులు పట్టే వాహనాన్ని ప్రారంభించారు. కోతుల సమస్యను పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

 అవసరమైతే కోతులను పట్టుకునేందుకు జేకేఎంఆర్​ సంస్థ ద్వారా ట్రైనింగ్ కూడా ఇస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్, దిశ కమిటీ సభ్యుడు వడ్ల నందు, నాయకులు పాండుగౌడ్, విజయభాస్కర్​ రెడ్డి, వివేకానందరెడ్డి, సుచరితా రెడ్డి, నరోత్తంరెడ్డి, అనిల్​యాదవ్​, రాచ శ్రీనివాస్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.