రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ ఎంపీగా లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ ఎంపీగా  కె. లక్ష్మణ్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఢిల్లీలో లక్ష్మణ్ ను బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు, మాజీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు జాతీయ నాయకత్వానికి,రాష్ట్ర నాయకత్వానికి లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ నుంచి ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ వాదనను వినిపించడానికి యూపీ నుంచి తనను రాజ్యసభకు ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు జాతీయ నాయకత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధికి  ఇదే నిదర్శనమన్నారు. కీలక పదవుల్లో వెనకబడిన వర్గాలకు బీజేపీ ప్రత్యేక గుర్తింపు ఇస్తుందన్నారు. రాష్ట్రపతి కోటాలో దక్షిణాదికి కేంద్రం పెద్ద పీట వేస్తూ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేసిందన్నారు. జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. తెలంగాణ వాదిగా తెలంగాణ అంశాలను పార్లమెంట్ ముందుంచాలని జేపీ నడ్డా సూచించారన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ,మజ్లిస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా ఉండటానికే బీజేపీ జమిలి ఎన్నికలను కోరుకుంటుందన్నారు.