పోలీసులు అంటే ఫిట్నెస్ కు మారుపేరు. ఎంతో ట్రైనింగ్, ఎంతో శిక్షణతో ఈ ఉద్యోగంలోకి వస్తుంటారు. శిక్షణ సమయంలో కొన్ని వేల కిలోమీటర్లు పరిగెత్తడం.. ఎన్నో మారథాన్ లు పూర్తి చేయడం కామన్. అలాంటి పోలీస్ లు ఒక ఖైదీ వెంట పరిగెత్తలేకపోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా స్టైల్ లో ఆగిఉన్న పోలీస్ వ్యాన్ నుంచి ఖైదీ పరారైతే.. అతని వెంట కొంత దూరం కూడా పరిగెత్తలేకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది.
వివరల్లోకి వెళ్తే.. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. అదుపులో ఉన్న ఖైదీ.. ఆగిఉన్న పోలీసు వ్యాన్ నుంచి ఎస్కేప్ అవ్వడం పోలీసులను షాకింగ్ కు గురిచేసింది. పోలీసుల రన్నింగ్ స్కిల్స్ పై ఈ వీడియో పెద్ద డిబేట్ కు తెరతీసింది.
మధ్యప్రదేశ్ లోని హొషంగాబాద్ ఔట్ స్కట్స్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేట్ అవుతోంది ఈ వీడియో. ఖైదీని తీసుకెళ్తున్న పోలీసులు.. రిపేర్ కు వచ్చిందని వ్యాన్ ను రోడ్డు పక్కన ఆపారు. రిపేర్ చేస్తూ పోలీసులు ఉండటం గమనించిన నిందితుడు.. వ్యాన్ డోర్ మెల్లిగా ఓపెన్ చేసుకుని పరుగు లంకించాడు.
అది గమనించిన పోలీసులు ఆ ఖైదీని వెంబడించారు. కానీ పోలీసులకు దొరకకుండా మరింత వేగంగా పరిగెత్తాడు దొంగ. దీంతో కొంత దూరం పరిగెత్తిన పోలీసులు.. తీవ్రమైన అలసటతో ఆగిపోయారు. విషయమేంటంటే.. పోలీసులు అలసిపోయారు కానీ.. దొంగ మాత్రం నాన్ స్టాప్ గా చాలా దూరం దొరకకుండా పరిగెత్తి తప్పించుకున్నాడు. అక్కడున్న ప్రయాణికులు పరిగెత్తి పట్టుకోవడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
మధ్య ప్రదేశ్ పోలీసులకు నెటిజన్ల ప్రశ్నలు:
ఈ వీడియో నెట్టింట్ల వైరల్ గా మారింది. బాలీవుడ్ సీన్ ను తలపిస్తున్న ఈ వీడియోపై మధ్యప్రదేశ్ పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇది సినిమా స్టైల్ ఎస్కేప్ అని.. అక్కడ కావాల్సింది వీడియోలో స్లోమోషన్ ఎఫెక్ట్ అని జోకులేస్తున్నారు. ఇది నిజంగా జరిగిందా లేదా సినిమా స్టైల్ లో వీడియో తీసేందుకు తీశారా అని ప్రశ్నిస్తున్నారు. అంత ట్రైనింగ్ తీసుకునే పోలీసులు దొంగతో సరిసమానంగా పరిగెత్తలేకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ये तो Filmy Scene हो गया 😂
— Wasim Ahmed (@TheWittyWasim) December 19, 2025
अपराधी भाग रहा गाड़ी से पुलिस पीछे पीछे @MPDial112 @MPPoliceDeptt
कृपया बताने का कष्ट करें आखिर क्या मामला है ? pic.twitter.com/C8Jb0NLtw5
