
- రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా జీవో ద్వారా అమలు చేయాలనే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య అన్నారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి రెండవసారి గవర్నర్తో జీవో తీసుకొస్తే చట్టం పకడ్బందీగా ఉంటుందన్నారు. గత 8 నెలలుగా బీసీ రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని..ఈ జీవో ద్వారా చట్టం చేసి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
శనివారం విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన బీసీల కోర్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ఆర్. కృష్ణయ్య హాజరై, మాట్లాడారు. రిజర్వేషన్లపై బీసీలకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూనే మరోపక్క అక్కసు వెళ్లగకుతున్నారని మండిపడ్డారు. అత్యధికంగా ఉన్న బీసీలు జనాభా దామాషా ప్రకారం వాటా అడుగుతుంటే బాధ ఎందుకు అని ప్రశ్నించారు.