V6 News

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :  ఎంపీ రఘునందన్‌‌రావు

పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి :  ఎంపీ రఘునందన్‌‌రావు

మెదక్ (చేగుంట), వెలుగు: వడగళ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌‌రావు డిమాండ్‌‌ చేశారు. చేగుంట మండలం కర్నాల్ పల్లి, మక్కరాజ్​పేట, గొల్లపల్లి గ్రామాల్లో రైతులతో కలిసి దెబ్బతిన్న వరి, పండ్ల తోటలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగళ్లతో రైతులు తీవ్రంగా  నష్టపోయారని, ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. మక్కరాజుపేట గ్రామంలో 1,520 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి ఉంటే ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు రైతులకు లెక్క కట్టి నష్ట పరిహారం చెల్లించే అవకాశం ఉండేదన్నారు.