
బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు ఎంపీ రఘునందన్ రావు. కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్లే ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కామెంట్లు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టొద్దన్నారు. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలన్నారు రఘునందన్ రావు.
బీఆర్ఎస్ నేతలు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ మహిళలను గౌరవించే సంస్కృతి లేదన్నారు. బీఆర్ఎస్ కు మహిళలంటే కేవలం కవిత ఒక్కరేనా అని ప్రశ్నించారు . కొండాసురేఖపై ట్రోలింగ్ కు హరీశ్ రావు, కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. తనవల్ల కొండాసురేఖకు ఇబ్బంది అయితే క్షమించాలని కోరారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని చెప్పారు.
ALSO READ | మహిళా మంత్రులను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తున్నది
తప్పుడు పనులు చేస్తున్నవాళ్లను ఎంకరేజ్ చేయొద్దని సూచించారు రఘునందన్ రావు. కించపరిచే కామెంట్లు చేసినవాళ్లు తగిన మూల్యం చెల్లించుకోవాలన్నారు. అమ్మకు ఆలీకి తేడా తెల్వకుండా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ మంత్రిని ప్రవర్తించడం తగదన్నారు రఘునందన్ రావు.