
యుద్ధం ఆపకుండా ఉండాల్సిందని కొంత మంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ రఘునందన్ రావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర తిరంగార్యాలీలో పాల్గొన్న ఆయన..యుద్ధం కావాలనే సన్నాసులందరిని ఒక్క నెల బోర్డర్ లో డ్యూటీ చేయించాలన్నారు. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ లో చెప్పాలని కిషన్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. సైన్యం ఆవేదన వారికి తెలియదన్నారు. కొందరు టీవీ డిబేట్ లో కూర్చుని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వారికి బుద్ధి చెప్పాలని ఫైర్ అయ్యారు రఘునందన్ . బయటి వాడిని ఎలాగూ గుర్తిస్తాం. యూనిఫాం లేకుండా మన పక్కన ఉన్న దేశ ద్రోహులను ముందు గుర్తించాలన్నారు. భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ ను గుర్తించాలన్నారు రఘునందన్ రావు.
మోదీ కంటిచూపుతోనే భస్మం చేశారు
పహల్గామ్ ఘటన( ఏప్రిల్ 22) మర్చిపోలేని రోజన్నారు మాజీ ఎంపీ సినీ నటి జయప్రద . మతం అడిగి భార్యల ముందే భర్తను చంపిన రోజన్నారు. భర్తను కోల్పోయిన భార్యకు ఉగ్రవాదులు వెళ్లి మీ మోడీకి విషయం చెప్పు అన్నారు. మోడీకి చెప్తే ఏమైందో వారికి అర్థమయ్యే ఉంటుందన్నారు జయప్రద . ఉగ్రవాదులు బుల్లెట్లు పేలిస్తే మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారన్నారు. తాను ముస్లింనే కానీ పాకిస్తాన్ కాదని అధికారిని సోఫీ ఖురేషి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి చంపుతానని సోఫియా ఖురేషి చెప్పారన్నారు
భారత్ వైపు చూస్తే కళ్లు పీకేస్తాం..
ప్రపంచం అంత మోడీ, భారత వైపు చూస్తోందన్నారు ఎంపీ గోడెం నగేష్. పాకిస్తాన్ కుక్కలరా? పాకిస్తాన్ ద్రోహులారా? భారత్ వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాం. మూడు రోజుల్లోనే పాక్ తోక వంకర చేశాం. మన దెబ్బతో పాకిస్తాన్ ఫైజామ్ లు తడిశాయి. ఇది శాంపిల్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా పాక్ ఏకాకి అయ్యింది. అంతర్గతంగా ఉన్న ఆ నా కొడుకులకు బుద్ధి చెప్పాలి అని అన్నారు.
►ALSO READ | వాళ్లు బుల్లెట్టు పేలిస్తే..మోదీ కంటి చూపుతోనే భస్మం చేశారు: జయప్రద