రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేస్తా : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి

రద్దయిన రైళ్ల పునరుద్ధరణకు కృషి చేస్తా : ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
  •     కారేపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రైల్వే ఆఫీసర్లతో మాట్లాడతా
  •     ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
  •     ఆర్మీ జవాన్ అనిల్ కుటుంబానికి పరామర్శ

కారేపల్లి, వెలుగు : రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించేలా రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కారేపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి శుక్రవారం కారేపల్లి మండలంలో పర్యటించిన ఎంపీ   రైల్వే స్టేషన్ ను సందర్శించారు. 

సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి రైల్వే స్టేషన్, రైళ్ల సమస్యలపై ఎంపీ కి వివరించి వినతి పత్రం అందజేశారు. అనంతరం మండలంలోని సూర్యా తండాకు చెందిన ఆర్మీ జవాన్ అనిల్ కుమార్ కుటుంబాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శించారు. అండగా ఉంటామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందాల్సినవన్నీ వచ్చేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు.

 ఆ తర్వాత కారేపల్లి లో గుండెపోటుతో మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు జడల వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు బొర్రా రాజశేఖర్, తలారి చంద్రప్రకాశ్, పగడాల మంజుల, ఇమ్మడి తిరుపతిరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, సురేందర్ మనియార్, బానోత్ రామ్మూర్తి, నర్సింగ్ శ్రీనివాస్, అడ్డగోడ ఐలయ్య మేదరి టోనీ, మల్లెల నాగేశ్వరరావు, అడపా పుల్లారావు, మేదరి రాజా, భీముడు, హీరాలాల్ పాల్గొన్నారు.