
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రోడ్లపై ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని కోరారు మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. డిఫెన్స్ అధికారులు 15 రోజులకోసారి రోడ్లు మూసివేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. స్కూల్ కు వెళ్లేందుకు విద్యార్థులు కష్టాలు పడుతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు అధికారులతో కేంద్రం చర్చించి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు రేవంత్ రెడ్డి.