స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండి

స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండి

హైదరాబాద్: తెలంగాణ యువతను కేసీఆర్ మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. వైన్, బార్ షాపుల ముందు కేసీఆర్ బొమ్మపెట్టండని ఆయన యువతకు సూచించారు. నోటిఫికేషన్‎లు ఇచ్చే వరకు చౌరస్తా దగ్గర క్వాటర్ మందు పోయండి లేదంటే స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండని రేవంత్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం పిలుపు మేరకు సోమవారం నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ డిపో ముందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘నల్ల చట్టాల రద్దు కోసం ఇప్పటికే 400 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ నుంచి బయలుదేరిన నలుగురు వ్యక్తులు.. దేశాన్ని ఆగం చేస్తున్నారు. మోడీ, అమిత్ షా అమ్మడానికి వస్తే.. అదానీ, అంబానీలు కొనడానికి ముందుకొస్తున్నారు. నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతోంది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆనాడు కేటీఆర్ బంద్‎లో పాల్గొన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏ పిలుపు వచ్చిందో ఏమో కానీ, ఇప్పుడు మోడీతో విందులో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు బంద్‎లో పాల్గొంటే.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తుండు. కరోనా కాలంలో ప్రజలను కేంద్రం, రాష్ట్రం కూడా ఆదుకోలే. సచ్చినా ఎవ్వడూ పట్టించుకోలే. కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్ర దేశంలో.. చస్తే కనీసం ఆరు అడుగుల గోతి కరువైంది. 

దేశవ్యాప్తంగా 33 కోట్ల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ అన్నాడు. కానీ, ఖాళీలను భర్తీ చేయడం మరిచాడు. ఉద్యోగులు రిటైర్ అవుతుంటే.. వాటిని కూడా భర్తీ చేయడం లేదు. బిశ్వాల్ కమిటీ లక్ష 91 వేల ఖాళీలు ఉన్నట్లు చెప్పింది. కృత్రిమ కొరత సృష్టించడానికే వ్యవసాయ చట్టాలు. వస్తువులన్నింటికీ కంపెనీలే ధర చెబుతుంటే.. రైతు పండించిన పంటకు రైతు ధర నిర్ణయించడం లేదు. పండించినోడు ధర చెప్పకుండా.. అదానీ, అంబానీ ధర డిసైడ్ చేస్తారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యం నడుస్తుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ నిరుద్యోగ యువతకు మాత్రం నౌకర్లు రాలె. తెలంగాణ యువతను కేసీఆర్ మత్తులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. వైన్, బార్ షాపుల ముందు కేసీఆర్ బొమ్మపెట్టండి. నోటిఫికేషన్‎లు ఇచ్చే వరకు చౌరస్తా దగ్గర యువత క్వాటర్ మందు పోయండి. లేదంటే స్విగ్గీలో ప్రగతిభవన్‎కు లిక్కర్ బాటిల్ బుక్ చేయండి’ అని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.

For More News..

వ్యాక్సిన్ కోసం వర్షాన్ని లెక్కచేయకుండా..

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు