రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: గులాబ్ తుఫాన్ కారణంగా రాబోయే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈ ప్రభావం ఉండనుందని తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రాకూడదని సూచించింది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలను సంప్రదించాలని తెలిపింది. గడిచిన రెండు గంటల్లో వైరాలో అత్యధికంగా 132.3 మీమీ వర్షాపాతం నమోదైంది. అదేవిధంగా కొణిజర్ల మండలంలో 79 మీమీ వర్షం కురిసింది.

కింది జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, మేడ్చల్, యాదాద్రి, వనపర్తి, వరంగల్ రూరల్ మరియు అర్బన్, ఖమ్మం, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.