దుర్గం చెరువు ఆక్రమణల వెనుక ఎంపీ సంతోష్.?

దుర్గం చెరువు ఆక్రమణల వెనుక ఎంపీ సంతోష్.?

టానిక్ సంస్థ యజమాని అనిత్ రెడ్డి, అతని గ్యాంగ్ కు సంబంధించి మరో బాగోతం బయటపడింది. అడ్డదారిలో దుర్గం  చెరు ఎకో టూరిజం పార్క్ లో పాగా వేసేందుకు ప్రయత్నించారు టానిక్ సంస్థ యజమానులు. టెండర్ వేయకున్నా ఎఎ అవోకెషన్స్ పేరుతో టూరిజం ప్రాజెక్ట్ ప్రారంభించారు. దీనిపై పలువరు స్వచ్చంధ సంస్థ కార్యకర్తలు.. మాదాపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 దుర్గం చెరువులో 2.2 ఎకరాలు లీజుకు తీసుకుని.. అదనంగా 3.7 ఎకరాల్లో ఆక్రమణలు చేసినట్లు కంప్లైంట్ చేశారు. 10 ఏళ్ల పాటు లీజుకి తీసుకున్న సంస్థ.. శాశ్వతంగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందని కంప్లైంట్ లో తెలిపారు. పార్కు పరిసర ప్రాంతం వైపు చూడకుండా సెక్యూరిటీ, బౌన్సర్లులను పెట్టినట్లు తెలుస్తోంది. 

దుర్గం చెరువులో ఆక్రమణల వెనుక BRS MP సంతోష్ రావు ఉన్నట్లు సీఎం రేవంత్ కు రాసిన లేఖలో ఆరోపించారు స్వచ్చంద సంస్థ కార్యకర్తలు. అప్పటి టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్ రావు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కూడా ఫిర్యాదు చేశారు.  పలువురు ప్రముఖులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. లీజింగ్,లీగల్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దుర్గం చెరువు ఎకో టూరిజం నష్టంను టానిక్ సంస్థల నుంచి రికవరీ  చేయాలని కోరారు.