ఏ కూటమిలో లేనందుకే ఎంపీ సీట్లు రాలె : శ్రీనివాస్ గౌడ్

ఏ కూటమిలో లేనందుకే ఎంపీ సీట్లు రాలె : శ్రీనివాస్ గౌడ్

న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో అటో ఇటో ఉంటే బీఆర్ఎస్‌‌కు కూడా 10-– 15 ఎంపీ సీట్లు వచ్చేవని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము ఈ రెండు కూటముల్లో లేకపోవడం వల్లే ఫలితాలు ఇలా వచ్చాయన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదన్నారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని, కొన్నేండ్ల తర్వాత ప్రజలు మార్పు కోరుకుంటారని చెప్పారు.