గొడవలతో దద్దరిల్లిన సెనెగల్ పార్లమెంట్

గొడవలతో దద్దరిల్లిన సెనెగల్ పార్లమెంట్

సెనెగల్ పార్లమెంట్ గొడవలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షాల మధ్య కొట్లాట జరిగింది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ప్రతిపక్ష ఎంపీ ఘర్షణకు దిగారు. అధికారపక్షానికి చెందిన మహిళను విచక్షణారహితంగా కొట్టాడు. మతనాయకుడిని అవమానించారని అధికారపక్ష ఎంపీ అమీన్డీయాను చెంపదెబ్బలు కొట్టాడు.

దీంతో సభలో ప్రతిపక్షాలు, అధికారపక్ష సభ్యులు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. మతగురువుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.