
శేరిలింగంపల్లి, వెలుగు: సిటీలో కాపు సంఘాల భవవ నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. రాష్ట్ర కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం మియాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సభకు ఎంపీ రవిచంద్రతోపాటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాపులు ఐక్యంగా ఆత్మగౌరవ సభ నిర్వహించడం అభినందనీయం అన్నారు. త్వరలో కేసీఆర్‌ను కలిసి కాపు సంఘాల భవనానికి స్థలం కేటాయింపుతో పాటు నిర్మాణం కోసం తగిన చర్యలు తీసుకొనేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మిరియాల రాఘవరావు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండా దేవయ్య, సంఘాల నాయకులు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, కె.ఎస్.ఎన్.మూర్తి, దాసరి రంగారావు, సుబ్బారావు, విష్ణుమూర్తి, మిరియాల ప్రీతమ్, గంధం రాజు, వరప్రసాద్, భరత్‌కుమార్, సమ్మెట ప్రసాద్, నాయుడు పాల్గొన్నారు.