
- వయనాడ్ వరదలకు రాహుల్ బాధ్యుడా..?
- వరుస రైలు ప్రమాదలకు, వందల సంఖ్యలో మరణాలకు బాధ్యులెవరు
- వాటికి బాధ్యత వహిస్తూ మోదీ, అశ్విన్ శ్రీ వైష్ణవ్ రాజీనామా చేయాలి
ఢిల్లీ: వయనాడ్ దుర్ఘటనకు రాహుల్ గాంధీ కారణమన్నట్టు బీజేపీ ఎంపీ తేజస్వీయాదవ్ మాట్లాడడం దారుణమని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను రాజకీయం చేయడం సరికాదని అన్నారు. గడిచిన 10 ఏళ్ల బీజేపీ హయాంలో ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి వందల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఆ ప్రమాదాలకు బీజేపీ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు.
బాధ్యత వహిస్తే ఎవరు రాజీనామా చేస్తారో బీజేపీ అధిష్టానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రత కోసం ఏటా రైల్వేశాఖ 20వేల కోట్లు ఖర్చు చేస్తుంది, ఆ 20 వేల కోట్లు ఎటుపోతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. రైలు ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, అశ్విని వైష్ణవ్ లు రాజీనామా చెయ్యాలని వంశీకృష్ణ డిమాండ్ చేశారు.