పిట్లంలో వైన్ షాప్పై అధికార పార్టీ నేతల దాడులు

పిట్లంలో వైన్ షాప్పై అధికార పార్టీ నేతల దాడులు

కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలు రౌడీయిజం చేశారు. పిట్లంలో కనకదుర్గ వైన్ షాప్పై ఎంపీపీ భర్త విజయ్, జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. మద్యం వ్యవహారాలు తమకు తెలిపి వ్యాపారం చేసుకోవాలని ఎంపిపీ భర్త విజయ్, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి హుకూం జారీ చేశారు. అదేంటని ప్రశ్నించిన వైన్ షాప్ వర్కర్లపై దాడులకు తెగబడ్డారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా పిట్లం పోలీసులు పట్టించుకోవడంలేదు. 

పోలీసుల ప్రేక్షక పాత్ర..
ఎంపీపీ భర్త విజయ్, జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి దాడిపై ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైన్స్ షాప్ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఎంపీపీ భర్త విజయ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డిలతో బిచ్కుంద ఎక్సైజ్ శాఖ అధికారులు కుమ్మక్కై తమపై దాడులు చేశారని చెబుతున్నారు. దాడుల్లో కోటి రూపాయల మద్యం, ఫర్నిచర్ ధ్వంసం అయినట్లు తెలిపారు. 2 రోజులుగా  వైన్స్ పై టీఆర్ఎస్ నేతలు దాడులు చేస్తున్నా..పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.