హనుమకొండ సిటీలో సంక్రాతి ముగ్గుల పోటీలు

హనుమకొండ సిటీలో సంక్రాతి ముగ్గుల పోటీలు

హనుమకొండ/ గ్రేటర్​ వరంగల్, వెలుగు: ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండ జవహర్ కాలనీలోని శిఖర స్కిల్ సెంటర్ లో సోమవారం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి, జువైనల్ జస్టిస్ మెంబర్ గోపికారాణి చీఫ్ గెస్టుగా హాజరై ముగ్గులను పరిశీలించారు. 

ఉత్తమ ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. గ్రేటర్​ వరంగల్​ పరిధిలోని 36వ డివిజన్​లో ఆడేపు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ట్రాఫిక్​ సీఐ సుజాత, ఫిట్​నెస్​ ట్రైనర్​ శ్రవంతి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు