మెసేజ్ ఇచ్చేలా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ

మెసేజ్ ఇచ్చేలా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా మధుదీప్ చెలికాని  దర్శకత్వంలో అరవింద్ మండెం నిర్మించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’.  శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్  డిస్ట్రిబ్యూషన్‌‌ ద్వారా మే 15న  విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో  త్రిగుణ్ మాట్లాడుతూ ‘సమ్మర్‌‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే ఫీల్‌‌గుడ్ ఎంటర్‌‌టైనరే ఈ చిత్రం.  రీసెంట్‌‌గా ప్రధాని మోదీ గారు  వర్క్ ఫ్రమ్ హోమ్  చేయమని చెప్పడం ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. 

ఐటీ జాబ్ వదిలేసిన ఓ కుర్రాడు వ్యవసాయం చేయాలనుకుంటే తన ఇంటి నుంచి, ఫ్యామిలీ నుంచి, అలాగే తన ప్రేమించిన అమ్మాయి నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఈ సినిమాలో  వినోదాత్మకంగా చెప్పాం. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నాడు. 

ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చెప్పింది.   కమర్షియల్ ఎలిమెంట్స్‌‌తోపాటు సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే చిత్రమిది  అని  డైరెక్టర్ మధుదీప్ అన్నాడు.  మంచి  కాన్సెప్ట్‌‌తో వస్తోన్న ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని నిర్మాత అరవింద్ అన్నారు. డిస్ట్రిబ్యూటర్ రామదాస్, నటులు  అనీష్ కురువిల్లా,  గుండు సుదర్శన్, బాబ్జీ పాల్గొన్నారు.