
ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్పార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి పోవడానికి.. ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కడియం శ్రీహరి కారణమని వ్యాఖ్యానించారు. కడియం శ్రీహరి ఓ గుంట నక్కలాంటోడని ద్వజమెత్తారు. స్టేషన్ ఘన్ పూర్ లో 99 శాతం ప్రజలు రాజయ్యను కోరుకుంటున్నారని చెప్పారు. కడియంకు బీఫామ్ ఎలా వస్తదో చూస్తామని హెచ్చరించారు. రాజయ్యపై ఈ మధ్యకాలంలో వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆ కుట్రల వెనుక కుట్ర దారి పాత్రధారి సూత్రధారి కడియం శ్రీహరి అని ఆరోపించారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ రాజయ్యకు ఇవ్వాలని లేకపోతే మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
ఇటీవల కేసీఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ కేసీఆర్ కడియం శ్రీహరికి కేటాయించారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ దక్కకపోవడంతో ఆవేదనతో రాజయ్య ఏడ్చిన సంగతి తెలిసిందే..