Mrunal Thakur: స్టార్ హీరోకు జోడిగా మృణాల్!..మరో సీతారామం షురూ

Mrunal Thakur: స్టార్ హీరోకు జోడిగా మృణాల్!..మరో సీతారామం షురూ

ప్రముఖ డ్యాన్సర్, నిర్మాత, డైరెక్టర్, హీరో లారెన్స్ (Raghava Lawrence) సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) నటించబోతోందని తెలుస్తోంది. ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ప్రస్తుతం యూత్ మృణాల్కు బాగా కనెక్ట్ అవుతున్నారు.. దాంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ అమ్మడును హీరోయిన్ పెట్టాలని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం మృణాల్ చేతిలో అర డజనుకు పై సినిమాలు ఉన్నాయి. రాఘవా లారెన్స్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుందనే వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట. మరో సీతారామం షురూ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మృణాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.

ఇటీవల నాని హాయ్ నాన్న మూవీలో హీరోయిన్గా నటించి సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ అనే మూవీలో నటిస్తోంది.