రేటు పెంచేసిన మృణాల్.. ఒక్క హిట్టుకే మరీ అంతనా?

రేటు పెంచేసిన మృణాల్.. ఒక్క హిట్టుకే మరీ అంతనా?

సీతా రామమ్(Setha ramam) హిట్టుతో ఫుల్ జోష్ లో ఉంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(mrunal thakur). ఈ సినిమా సక్సెస్ తో.. దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. దీంతో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ఈ ప్రాజెక్ట్స్ కోసం మృణాల్ భారీగానే డిమాండ్ చేస్తోందట. 

ప్రస్తుతం మృణాల్ రెమ్యునరేషన్ డీటెయిల్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే ఏవేరైనా. సీతా రామమ్ సినిమాకు ముందు.. ఒక్కో సినిమాకు రూ.70 లక్షలు తీసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 నుండి రూ.4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట. ఇందుకు మేకర్స్ కూడా ఏమాత్రం వెనుకాడటం లేదట. మృణాల్ అడిగినంతా ఇవ్వడానికి సరే అంటున్నారట. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలా ప్రస్తుతం మృణాల్ క్రేజ్ ఏంటో చెప్పడానికి.        

ఇక  ప్రస్తుతం మృణాల్ తెలుగులో నెచురల్ స్టార్ నాని(Nani)తో ఓ  సినిమా చేస్తోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ(Vijay devarakonda)తో కూడా ఒక సినిమా చేసేందుకు సైన్ చేసింది ఈ బ్యూటీ. పరశురామ్ పెట్ల(Parashuram petla) దర్శకత్వంలో రానున్న ఈ సినిమాను.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil raju) నిర్మించనున్నారు.