Mrunal Thakur : క్రికెటర్‌ శ్రేయస్ అయ్యర్‌తో మృణాల్ డేటింగ్.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన బ్యూటీ !

Mrunal Thakur : క్రికెటర్‌ శ్రేయస్ అయ్యర్‌తో మృణాల్ డేటింగ్.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన  బ్యూటీ !

'సీతారామం' మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి మృణాల ఠాకూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. 'హాయ్ నాన్న', 'ఫ్యామిలీ స్టార్'  వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మరో రెండు సినిమాలు చేసిన తర్వాత, ఆమె దృష్టిని పూర్తిగా హిందీ చిత్రాలపై మళ్లించింది.  అయితే ఇటీవల నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఈ ముద్దుగమ్మ పేరు ఒక ప్రముఖ క్రికెటర్‌తో ముడిపెట్టబడటం హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై మృణాల్ క్లారిటీ ఇచ్చింది.

రూమర్స్‌పై నవ్వుకుంటున్నా..

మృణాల్ ఠాకూర్, టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో డేటింగ్‌లో ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం మృణాల్ దృష్టికి చేరడంతో.. దీనిపై  ఆమె సరదాగా స్పందించింది. ఇలాంటి రూమర్స్ వినడానికి చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఎవరో వాటిని సృష్టిస్తుంటారు. వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఇవన్నీ ఉచితంగా వచ్చే పీఆర్ స్టంట్స్ లాంటివి అంటూ మృణాల్ ఈ డేటింగ్ వార్తలను  కొట్టిపారేసింది.

అంతే కాదు ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌తో కూడా ఈమె డేటింగ్ చేస్తుందనే వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా మృణాల్ స్పందిస్తూ..  ధనుష్ తన మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది. ఇలా తరచూ సెలబ్రిటీలతో మృణాల్ పేరు ముడిపెట్టడం, ఆమెకు మీడియాలో ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు.

 మృణాల్ తదుపరిప్రాజెక్టులు..

ఈ ఏడాది హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న మృణాల్, వచ్చే ఏడాది తిరిగి తెలుగు , హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రంలో మృణాల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. ఇక  ప్రస్తుతం అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ - అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రానున్న చిత్రం 'AA22' .  ఈ మూవీలోఅల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో మృణాల్ చేరితే, అది ఆమె కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందని సినీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో పెద్ద స్టార్లతో సినిమాలు చేస్తూ.. రూమర్స్‌ను పక్కన పెట్టి తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది..