
రాంచీ: మోడ్రన్ ఇండియా మోస్ట్ లవబుల్ క్రికెటర్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టాడు. భార్య సాక్షి సింగ్, కూతురు జీవాతో కలిసి రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో ధోనీ హంగామా లేకుండా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇండియన్ క్రికెట్ హిస్టరీని తిరగరాసిన మహీకి సహచర క్రికెటర్లతో పాటు కోట్లాది మంది ఫ్యాన్స్బర్త్ డే విషెస్ చెప్పారు. కెప్టెన్ కూల్‌గా పేరు తెచ్చుకున్న మహీ.. ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచిన ఏకైక కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఎన్ని ఘనతలు సాధించినా ఓ కర్మయోగిలా తన పని చేసుకుంటూపోతాడు. అందుకే వరల్డ్ క్రికెట్లో ఓ ఐకాన్‌గా నిలబడ్డాడు.
బహుమతులకు లొంగవు: సాక్షి
బర్త్‌డే సందర్భంగా ధోనీకి అతని భార్య సాక్షి స్పెషల్ విషెస్ చెప్పింది. ‘నీ పుట్టిన రోజును గుర్తు చేసుకుంటూ ఏడాది గడిచిపోయింది. కొంచెం వయసు పెరిగింది. ఇంకాస్త తెలివిగా, మరింత స్వీట్ పర్సన్‌గా మారాల్సిన టైమ్ వచ్చింది. బహుమతులకు లొంగని వ్యక్తివి నువ్వు. కేక్ కట్ చేసి, క్యాండిల్స్ వెలిగించి మరో ఏడాదిని సెలబ్రేట్ చేసుకుందాం. హ్యాపీ బర్త్ డే’ అని సాక్షి ట్వీట్ చేసింది. ఇండియన్ క్రికెటర్లతో పాటు వరల్డ్ ప్లేయర్లు కూడా ధోనీకి విషెస్ అందజేశారు. చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేయర్ డ్వేన్ బ్రావో.. ‘ఎంఎస్ ధోనీ నంబర్ 7’ పేరిట ఓ పాటను విడుదల చేశాడు. ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ తానే స్వయంగా పాడాడు. పాండ్యా సోదరులు చార్టెడ్ ఫ్లైట్‌లో రాంచీ వెళ్లి మరి మహీకి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.
సీఎస్కే బాస్ ధోనీయే
మరో పదేళ్లలో ధోనీ.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు పర్మినెంట్ బాస్‌గా మారిపోతాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నాడు. ‘సీఎస్కే కోసం మహీ చాలా కష్టపడ్డాడు. జట్టంటే అతనికి చాలా ఇష్టం. ఫ్యూచర్లో కచ్చితంగా సీఎస్‌కే బాస్ అవుతాడని నా గట్టి నమ్మకం. ఇక ఈ సీజన్ ఐపీఎల్ కోసం ధోనీ చాలా శ్రమించాడు. మార్చిలో జరిగిన ప్రాక్టీస్ క్యాంప్‌లో ఎప్పుడూ లేనంత గట్టిగా పోరాడాడు. అతను గ్రేట్ ప్లేయర్. ఎప్పటికీ తన స్వభావాన్ని మార్చుకోడు. అందుకే మహీని అందరూ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాడు. టీమ్‌లోని ప్రతి ఒక్కరి నుంచి పూర్తి సామర్థ్యాన్ని రాబడతాడు’ అని విశ్వనాథన్ వ్యాఖ్యానించాడు.
నంబర్ ప్లేట్స్ ఇస్తలేరు.. 4 నెలలుగా ఇదే పరిస్థితి