IPL 2023: సిక్సులతో హోరెత్తించిన ధోని

IPL 2023: సిక్సులతో హోరెత్తించిన ధోని

ఐపీఎల్ 2023కు చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్  మహేంద్ర సింగ్ ధోని గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు. గతేడాది ఘోర వైఫల్యాలతో తీవ్ర విమర్శులు ఎదుర్కొన్న ఈ సారి ఎలాగైనా టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు. ఇందులో భాగంగా నెట్స్ లో చెమటోడుస్తున్నాడు. ధోని ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సిక్సుల మీద సిక్సులు..

ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది.  అదే రోజు చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇప్పటికే ధోని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. నెట్స్లో సిక్సులు ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలర్లు బంతి ఎక్కడ వేసినా వాటిని సిక్సర్లుగా మలుస్తున్నాడు. ముఖ్యంగా బౌలర్ తలపై కొట్టిన సిక్స్..హైలెట్ గా నిలిచింది. 

ఇదే చివరి ఐపీఎలా..?

మరోవైపు ఎంఎస్ ధోనికిదే చివరి ఐపీఎల్ కానున్నట్లు తెలుస్తోంది. గతేడాదే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ సొంత ప్రేక్షకుల ముందు ఐపీఎల్కు గుడ్ బై చెప్పాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ తర్వాత ధోని రిటైర్ అవుతాడని  అభిమానులు అనుకుంటున్నారు. ఇందులో భాగంగా తన చివరి ఐపీఎల్ లో జట్టును విజేతగా నిలపాలని కృతనిశ్చయంతో ఉన్న ధోని..ఆ దిశగా ప్రాక్టీస్ చేస్తున్నాడు.