ఫ్యాన్స్కు ధోని గుడ్ న్యూస్

ఫ్యాన్స్కు ధోని గుడ్ న్యూస్

క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగించే వార్త చెప్పాడు టీమిండియా మాజీ కెప్టెన్,  CSK కెప్టెన్ ఎంఎస్ ధోని. వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టాడు. రాజస్థాన్ మ్యాచ్లో ధోని టాస్ గెలిచిన తర్వాత..కామెంటేటర్ ఇయాన్ బిషప్ ..ధోని రిటైర్మెంట్ గురించి అతన్ని ప్రశ్నించాడు. దీనికి ధోని బదులిస్తూ ..నేను అయితే కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతానో లేదో చెప్పలేను. కానీ CSK తరఫున CSK హోమ్ గ్రౌండ్ చెపాక్లో CSK అభిమానుల ముందు ఆడాలనుకుంటున్నా. ఇదే నా  లాస్ట్ ఐపీఎల్ అని చెబితే మాత్రం CSK ఫ్యాన్స్కు  అన్యాయం చేసినట్లే అవుతుంది. అందుకే 2023 ఐపీఎల్లోనూ ఎల్లో జెర్సీలో కన్పించాలనుకుంటున్నా. 

వచ్చే ఏడాది ఐపీఎల్ మ్యాచులు అన్ని పట్టణాల్లో జరుగుతాయి. అప్పుడు సొంత గ్రౌండ్లో చెన్నై అభిమానుల మధ్య రిటైర్మెంట్ తీసుకుంటే బాగుటుందని అనుకుంటున్నా.  అయితే దీని గురించి ఇప్పుడే కచ్చితంగా నేను చెప్పలేను అని ధోనీ పేర్కొన్నాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో ధోని విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఐపీఎల్లోనూ ధోని బెస్ట్ కెప్టెన్. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకు నాలుగు సార్లు టైటిళ్లను అందించాడు. అటు ఛాంపియన్స్ లీగ్లోనూ చెన్నైను రెండుసార్లు విజేతగా ధోని నిలబెట్టాడు.