భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, నటి భారతరత్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ. ప్రతి రోజూ కోట్లాది మంది ఇళ్లలో, ఆలయాల్లో మారుమ్రోగే 'శ్రీ వేంకశ్వర సుప్రభాతం' ఆమె దివ్వగాత్రం నుంచి జాలువారింది. అయితే ఈ గానకోకిల జీవిత కథ ఆధారంగా ఓ భారీ బయోపిక్ తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. 'జెర్సీ' సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్నారు.
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..
అయితే ఈ సినిమాలో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో సస్పెన్స్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చినా అవి వర్కౌంట్ కాలేదు. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రెస్టీజియస్ బయోపిక్‌లో లీడ్ రోల్ ప్లే చేయడానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లు సమాచారం.. ఇటీవల ఈ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా సీక్రెట్‌గా జరిగిందట. సంప్రదాయబద్ధంగా ఉండే ఆ లుక్‌లో రష్మిక నటన చూసి మేకర్స్ ఫిదా అయ్యారని టాక్. అయితే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
►ALSO READ | 38 ఏండ్లకే గుండె పోటుతో ప్రముఖ సింగర్ పెప్సీ శర్మ కన్నుమూత
మారిన ఈక్వేషన్స్..
నిజానికి ఈ బయోపిక్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎంతోమంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట్లో ఈ పాత్రను నేచురల్ బ్యూటీ సాయి పల్లవి చేస్తుందని ప్రచారం జరిగింది. ఆమె కర్ణాటక సంగీతంలో క్లాసులు కూడా తీసుకుంటోందని, గౌతమ్ తిన్ననూరి రీసెర్చ్ వర్క్ పూర్తి కాగానే షూటింగ్ స్టార్ట్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత పేరు తెరపైకి వచ్చింది. కానీ, ఫైనల్‌గా ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ రష్మిక మందన్న చేతికి చిక్కినట్లు తెలుస్తోంది.
చేతినిండా ప్రాజెక్ట్‌లు..
వరుస ప్రాజెక్టులతో రష్మిక దూసుకెళ్తోంది. ఒకవైపు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రూమర్స్ షేక్ చేస్తుంటే.. మరోవైపు ఇటీవల నటించిన 'కాక్‌టెయిల్ 2' ట్రైలర్ యూట్యూబ్‌ను ఊపేస్తోంది. ఈ ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి రష్మిక ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. అటు విజయ్ దేవరకొండతో కలిసి 'రణబాలి' నటిస్తుంది. ఒకవేళ ఈ బయోపిక్‌ను ఓకే చేస్తే ఆమె కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
