38 ఏండ్లకే గుండె పోటుతో ప్రముఖ సింగర్ పెప్సీ శర్మ కన్నుమూత

38 ఏండ్లకే గుండె పోటుతో ప్రముఖ సింగర్ పెప్సీ శర్మ కన్నుమూత

చంఢీఘర్: హర్యానా సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్, రాగిణి కళాకారుడు పెప్సీ శర్మ (38) గుండె పోటుతో కన్నుమూశారు. సోమవారం (జూన్ 8) ఛాతీలో నొప్పి రావడంతో ఆకస్మాత్తుగా ఇంట్లో కుప్పకూలిపోయాడు పెస్సీ శర్మ. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

 38 ఏళ్ల చిన్న వయస్సులోనే పెప్సీ శర్మ హఠాన్మరణం అతడి అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పెప్సీ శర్మ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖు సంతాపం తెలిపారు. పెప్సీ శర్మకు 10, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. 

పెప్సీ శర్మ బ్యాగ్రౌండ్:

పెప్సీ శర్మగా ప్రసిద్ధి చెందిన ఈ గాయకుడి అసలు పేరు యశ్‌పాల్ శర్మ. ఘజియాబాద్‌లోని పట్లా గ్రామానికి చెందిన యశ్ పాల్ శర్మకు పెప్సీ శర్మగా పేరు రావడం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. యశపాల్ శర్మను అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చిన్నప్పటి నుండి ప్యాపీ అని పిలిచేవారు. 20 ఏళ్ల క్రితం యశ్ పాల్ సింగర్‎గా ఎదుగుతున్న క్రమంలో ఓ వ్యక్తితో గొడవ జరిగింది. అతడి పేరు లౌకీ. ఈ గొడవ కోర్టు వరకు వెళ్లింది. 

►ALSO READ | నిర్మాతను రూ. 500 కోట్లు డిమాండ్ చేసిన హృతిక్ .. 'క్రిష్ 4' ప్రొడక్షన్ పంచాయితీపై అసలు నిజం ఇదే!

కోర్టులో విచారణ సందర్భంగా లౌకీ, ప్యాపీ పేర్లు విన్న జడ్జి.. ప్యాపీ అనే పేరు కంటే పెప్సీ అని పెట్టుకుంటే బాగుంటుందని సరదాగా వ్యాఖ్యానించారు. జడ్జ్ చెప్పిన పేరు నచ్చడంతో యశ్ పాల్ శర్మ తన స్టేజ్ పేరును పెప్సీ శర్మగా మార్చుకున్నాడు. ఇక, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ-NCR వంటి ప్రాంతాలలో జరిగే స్థానిక ఉత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన ప్రదర్శనలకు ఎంతో పేరుంది. ఫోక్ సాంగ్స్, కామెడీ, అద్భుతమైన స్టేజ్ ప్రెజెన్స్‌తో అన్ని వయసుల ప్రేక్షకులను ఎంతోగాని అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పెప్సీ శర్మ.