హాస్టల్ బిల్డింగ్పై నుంచి పడిన ఎంటెక్ స్టూడెంట్

హాస్టల్ బిల్డింగ్పై నుంచి పడిన ఎంటెక్ స్టూడెంట్

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి పడి ఓ ఎంటెక్ ​స్టూడెంట్​తీవ్రంగా గాయపడ్డాడు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. హెచ్‎సీయూలో  కౌశిక్ (22) ఎంటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. వర్సిటీలోని ఐ మెన్స్ హాస్టల్ బ్లాక్–ఏలోని రూమ్​ నంబర్ 202లో ఉంటున్నాడు. 

ఆదివారం తెల్లవారుజామున అతను హాస్టల్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలవడంతో తోటి విద్యార్థులు ఓ ప్రైవేట్ హాస్పిటల్​కు తరలించారు. ప్రస్తుతం కౌశిక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే అతను ప్రమాదవశాత్తు కింద పడ్డాడా లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?  అనేది తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.