కల నెరవేర్చుకున్న పోలీస్

V6 Velugu Posted on Oct 19, 2021

  • 21ఏళ్ల వయసులోనే ఆల్ రౌండ్ టాలెంట్

మల్టీ టాస్కింగ్​ అంటే మహిళలకు నల్లేరు మీద నడక.. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్షా హంగ్మా. సిక్కింకు చెందిన ఈమె పోలీస్​ అధికారిగా, మోడల్​గా, బాక్సర్​గా వేర్వేరు ఫీల్డ్స్​లో పేరు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన ఎంటీవీ సూపర్​ మోడల్​ సీజన్​2లో పార్టిసిపేట్​ చేసింది. 21 ఏండ్లలోనే ఇన్ని సాధించిన ఆమె గురించి... 
ఇక్షాను ఇప్పుడు సిక్కిం సూపర్​ విమెన్​ అంటున్నారు. ఎందుకంటే ఆమె టాలెంట్​ అలాంటిది మరి. పుట్టింది సిక్కింలోని రుంబాక్ అనే చిన్న ఊళ్లో. మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీలో పుట్టిన ఆమె గొప్ప గొప్ప కలలు కన్నది. మోడల్​ కావాలని చిన్నప్పుడు అనుకుంది. ఇండియాలోనే సూపర్​ మోడల్ గా పేరు తెచ్చుకోవాలనేది ఆమె చిన్ననాటి కల. చిన్నప్పుడు ‘ఎంటీవీ’లో వచ్చే సూపర్​ మోడల్​ ఎపిసోడ్స్​ను తెగ చూసేది. ఎప్పటికైనా తను కూడా అలా కనిపించాలని గట్టిగా కోరుకుంది. టీనేజ్​లోకి అడుగుపెట్టాక ఫిట్​నెస్​ పై దృష్టి పెట్టింది. మోడల్ కావాలన్న​ డ్రీమ్ గురించి తండ్రితో చెప్పింది. తండ్రి కూడా ఎంకరేజ్​ చేశాడు. ఫిట్​నెస్​ నుంచి ఇక్షా బాక్సింగ్​ వైపు అడుగులు వేసింది. నేషనల్​ లెవల్​ బాక్సింగ్​ పోటీల్లో పార్టిసిపేట్​ చేసింది. కానీ, అంతలోనే సరైన ఆదాయం ​ లేక ఇక్షా కుటుంబం ఇబ్బందులు పడింది. దాంతో కుటుంబ బాధ్యతల్ని కూడా తీసుకుంది ఇక్షా. డిగ్రీ తర్వాత ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలవాలి అనుకుంది. అందుకని ఫిట్​నెస్​కు తగ్గట్టు పోలీస్​ ఉద్యోగంలో చేరాలనుకుంది. డిగ్రీ అయిపోయిన కొద్ది రోజులకే సిక్కిం పోలీస్​ ఫోర్స్​లో జాబ్​ తెచ్చుకుంది. 14 నెలల ​ ట్రైనింగ్​ తర్వాత పోలీస్​గా బాధ్యతలు స్వీకరించింది. ఉద్యోగం మీద ప్రేమ, మరో వైపు మోడల్ కావాలన్న ప్యాషన్​ను రెండింటినీ బ్యాలెన్స్​ చేయగలిగింది. అంతేకాదు బాక్సర్‌‌గా కూడా రాణిస్తోంది. మోడలింగ్​ కూడా చేస్తోంది. ఈమధ్యనే చిన్నప్పటి నుంచి తను కలలు కన్న ఎంటీవీ రియాల్టీ షోలో పాల్గొన్నది. ముంబైలో జరిగిన ‘సూపర్​​ మోడల్​ సీజన్​ 2’లో పార్టిసిపేట్​ చేసి టాప్​ 9 మోడల్​గా సెలక్ట్​ అయింది.
 

Tagged BOXER, Model, MTV Super model-2021, Sikkim Girl, Super cop, Eksha

Latest Videos

Subscribe Now

More News