
గోదావరిఖని, వెలుగు: త్వరలో విడుదల కానున్న కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక కోసం శిక్షణ ఇచ్చేందుకు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని సింగరేణి స్టేడియంలో రన్నింగ్ పోటీలు నిర్వహించారు.
కాగా సింగరేణి స్టేడియం వర్షపు నీటితో బురదమయంగా మారడంతో కొందరు అభ్యర్థులు జారిపడ్డారు. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఎంపిక కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా రన్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.