రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకుందాం

రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకుందాం
  • ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశ్​

పరిగి, వెలుగు: ముదిరాజ్​లకు రావాల్సిన రాజకీయ వాటాను దక్కించుకోవాలని తెలంగాణ ముదిరాజ్​మహాసభ రాష్ట్ర నాయకుడు  కాసాని వీరేశ్ అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగిలోని ఎస్ గార్డెన్స్​లో శుక్రవారం నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.చీఫ్​ గెస్టుగా హాజరైన  కాసాని జ్ఞానేశ్వర్​ కొడుకు వీరేశ్​ మాట్లాడుతూ.. తొందరలోనే నియోజకవర్గంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారనే సర్వే నిర్వహించి రిపోర్టు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.

రాష్ట్రంలోని 38 నియోజకవర్గాల్లో అత్యధికంగా ముదిరాజ్ ఓటర్లు ఉన్నారన్నారు. తొందరలో నిర్వహించబోయే సర్వేకు సహకరించాలన్నారు. ప్రతి ఓటరు జాబితా,సెల్​నంబర్​తో రిపోర్టును తయారు చేసి డిజిటలైజేషన్​ చేయనున్నామన్నారు. ముదిరాజ్​లను బీసీ ‘డి’ నుంచి బీసీ ‘ఎ’ లోకి మార్చుకునేందుకు  కృషి చేయాలన్నారు.