‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa The Lion King) వస్తోంది. డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దీనికి దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ముఫాసా తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.
లేటెస్ట్గా ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు ట్రైలర్ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ''అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి నా ఇంటి నుంచి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంతలోనే మాయం అవుతుంది'' అంటూ ట్రైలర్‌లో వినిపించిన మహేష్ మొదటి మాట.
అలాగే 'నేనుండగా నీకు ఏం కాదు టాకా, భయపడకు'..అనే ఈ మాటలో మహేష్ హీరోయిజం ఉంది. ఆ మాట మహేష్ బాబు చెప్పడం వల్ల ట్రైలర్ మరింత ఎలివేట్ అయ్యింది. 'మనం ఒక్కటిగా పోరాడాలి' అని మహేష్ చెప్పిన మాట సైతం ఆకట్టుకుంటోంది.
ALSO READ : Samantha: చైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత..'ప్రేమంటే ఓ త్యాగం' అంటూ సమంత పోస్టు
మహేష్తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. మరియు అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు.అడవి యొక్క అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్ యొక్క వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది. ఇక మహేష్ బాబు గొంతుతో ఆ పవర్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవ్వండి. గతంలో ‘ది లయన్ కింగ్’కు తెలుగులో నాని డబ్బింగ్ చెప్పాడు.
అయితే,ఇందులోని లీడ్ రోల్ అయిన ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ హిందీ వెర్షన్ లో డబ్బింగ్ చెప్పారు. అలాగే ముఫాసా కొడుకు సింబా పాత్రకు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పగా, చిన్న కొడుకు అబ్రమ్ ఖాన్ ముఫాసా చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ చెప్పాడు.