మెజిషియన్ సామల వేణుకు అరుదైన గుర్తింపు

మెజిషియన్ సామల వేణుకు అరుదైన గుర్తింపు

పద్మారావునగర్, వెలుగు: తెలంగాణకు చెందిన ప్రముఖ మెజిషియన్, ఇల్యూషనిస్ట్ సామల వేణుకు అమెరికాలో ప్రత్యేక గుర్తింపు లభించింది. హడ్సన్ కౌంటీ కమిషనర్ విలియం ఓడీ నుంచి బుధవారం ప్రత్యేక అభినందన పత్రాన్ని (ప్రక్లమేషన్) అందుకున్నారు.

 గత 40 ఏండ్లకుపైగా సామాజిక, సాంస్కృతిక, కళా, వినోద రంగాల్లో అందించిన సేవలకు గుర్తింపుగానూ ఆయనకు ఈ గౌరవం లభించింది. అలాగే కెర్నీ మేయర్ క్యారల్ జీన్ డాయిల్, న్యూజెర్సీ సిటీ కౌన్సిల్ అధ్యక్షురాలు జాయిస్ వాటర్​మ్యాన్ కూడా సామల వేణును సన్మానించి, ప్రత్యేక ప్రశంసాపత్రం అందజేశారు. 

న్యూజెర్సీ సిటీ మేయర్ ఆఫీస్​లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, శ్రేయోభిలాషులు రాజేందర్ దిచిపల్లి, సామాజిక కార్యకర్త అర్జుమంద్ జువేరియా (న్యూజెర్సీ), మాధవి సామల పాల్గొన్నారు.