V6 News

ముకేశ్ శర్మకు మాయా ఖుబానీ అవార్డు: జైపూర్ ఫొటోగ్రఫీ పోటీల్లో ఫస్ట్

ముకేశ్ శర్మకు మాయా ఖుబానీ అవార్డు: జైపూర్ ఫొటోగ్రఫీ పోటీల్లో ఫస్ట్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: జైపూర్ ఫొటోగ్రాఫర్స్ క్లబ్  నిర్వహించిన మాయా ఖుబానీ 13వ వార్షిక ఫొటోగ్రఫీ పోటీల్లో హైదరాబాద్​ కు చెందిన ముకేశ్ శర్మకు ఫస్ట్​ ప్రైజ్ దక్కింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 115 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొని స్ట్రీట్, వైల్డ్‌‌‌‌లైఫ్, ఫ్యాషన్, ల్యాండ్‌‌‌‌స్కేప్, పోర్ట్రెయిట్, మొబైల్ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో 134 ఫొటోలను ప్రదర్శించారు. 

ఇందులో నగరానికి చెందిన ముకేశ్ శర్మకు మొదటి బహుమతి, ముంబైకి చెందిన బివేకానంద పత్రకు సెకండ్​గెలుచుకున్నారు. కార్యక్రమంలో జేపీసీ ఫౌండర్ అనిల్ ఖుబానీ, ఐఐహెచ్​ఎంఆర్​ డైరెక్టర్ డా. లలిత్యా గుప్తా, అభినవ్​ మిశ్రా, పవన్​అగర్వాల్, సత్యప్రకాశ్​భారతి, ఖుషీరామ్ చౌదరి పాల్గొన్నారు.