
–హైదరాబాద్, వెలుగు : మల్టీ జోన్–2 హెడ్మాస్టర్ల ప్రమోషన్లపై ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడాన్ని టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, నవాత్ సురేశ్హర్షం వ్యక్తం చేశారు. పాత షెడ్యూల్ను కొనసాగించేందుకు అనుమతిచ్చిన నేపథ్యంలో, వెంటనే ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టాలని కోరారు. విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంను సోమవారం ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తపస్ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎన్నో ఏండ్ల నుంచి పనిచేస్తున్న టీచర్లు ప్రమోషన్లు పొందకుండా రిటైర్డ్ అవుతున్నారని తెలిపారు. లోక్ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందే ఈ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.