హైదరాబాద్, వెలుగు: బహుభాషా విద్య సిఫార్సులు కేవలం పాలసీలకే పరిమితం కాకుండా, నేరుగా క్లాస్‌రూంలో అమలు కావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ అన్నారు. జాతీయ విద్యా విధానం2020కు తగ్గట్టుగా యునెస్కో బహుభాషా విధానంపై దృష్టి పెట్టడాన్ని ఆయన అభినందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో యునెస్కో ‘భాషా మ్యాటర్స్: స్టేట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా 2025 (ఎస్ఓఈఆర్)’ నివేదికను నికోలస్ రిలీజ్ చేశారు.
అనంతరం. డాక్టర్ మినతి పాండా రాసిన ఈ రిపోర్ట్ రాష్ట్ర స్థాయి ఆవిష్కరణ కార్యక్రమాన్ని యునెస్కో దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హుమా మసూద్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష లేదా ఇంట్లో మాట్లాడే భాషలో బోధించినప్పుడు పిల్లల్లో రీడింగ్ సామర్థ్యం, విషయ అవగాహన, క్లాసులో యాక్టివ్‌గా పాల్గొనడం బాగా పెరుగుతాయని ఒడిశా, తెలంగాణలోని గిరిజన, గ్రామీణ ప్రాంతాల కేస్ స్టడీలు నిరూపించాయని నివేదిక వెల్లడించింది.
