హర్యానా హైవేపై పొగమంచు.. నాలుగు బస్సులు ఢీ

హర్యానా హైవేపై పొగమంచు.. నాలుగు బస్సులు ఢీ

రేవారి:  హర్యానాలో ఆదివారం తెల్లవారుజామున భారీ ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో రేవారి జిల్లాలోని నేషనల్ హైవే 352డీ పై నాలుగు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

బస్సులు బస్సులు రేవారి నుంచి బయలుదేరి ఝజ్జర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. పొగమంచు వల్ల విజిబిలిటీ తగ్గిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

గ్రేటర్ నోయిడాలోను ఢీకొన్న పలు వాహనాలు

గ్రేటర్ నోయిడాలోని నేషనల్ హైవే 91పై ఆదివారం తెల్లవారుజామున అరడజనుకుపైగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పొగమంచుతో రోడ్డు విజిబిలిటీ తగ్గిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో హైవేపై కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో దెబ్బతిన్న వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.