హరగోపాల్ పై UAPA కేసు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ములుగు ఎస్పీ

హరగోపాల్ పై UAPA కేసు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన ములుగు ఎస్పీ

సీఎం కేసీఆర్ ఆదేశాలతో  ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం(UAPA)  కేసు ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు. హరగోపాల్ తో పాటు  ఐదుగురిపై కేసులు ఎత్తివేస్తున్నట్లు తెలిపారు.  కేసులు ఎత్తివేస్తూ న్యాయరంగా మెమో దాఖలు చేస్తామన్నారు పోలీసులు.

ప్రొఫెసర్ హరగోపాల్  చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద  కేసు నమోదయ్యింది.ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లు ఏడాది క్రితమే పెట్టినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  హరగోపాల్ తో పాటు మరో 152 మందిపై ఉపా కేసులు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని కేసు నమోదు చేశారు పోలీసులు. 

హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసంఘాలు,ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. కేసును ఎత్తివేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. లేకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జూన్ 17న ఉదయం హరగోపాల్ పై ఉపా కేసును ఎత్తివేయాలని డీజీపీ  అంజనీకుమార్ ను ఆదేశించారు. దీంతో ఉపా కేసును ఎత్తివేస్తున్నట్లు ములుగు ఎస్పీ ప్రకటించారు.