Ranji Trophy Final: రంజీ ట్రోఫీ విజేతగా ముంబై.. ఫైనల్లో విదర్భ పోరాటం వృధా

Ranji Trophy Final: రంజీ ట్రోఫీ విజేతగా ముంబై.. ఫైనల్లో విదర్భ పోరాటం వృధా

రంజీ ట్రోఫీలో అద్బుతాలేమీ చోటు చేసుకోలేదు. భారీ లక్ష్య ఛేదనలో విదర్భ బయపెట్టినా ముంబై విజేతగా అవతరించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్ లో విదర్భపై 169 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ముంబై రికార్డు స్థాయిలో 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ముంబై చివరిసారిగా 2015-16 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.

5 వికెట్లకు 248 పరుగులతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన విదర్భ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. మాలుగో రోజు పోరాటాన్ని కొనసాగిస్తూ ముంబై బౌలర్లను వణికించారు. ఏకపక్షంగా జరిగే మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చేశారు. దీంతో తొలి సెషన్ వరకు రంజీ ట్రోఫీ ఫైనల్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. కెప్టెన్ అక్షయ్‌‌‌‌‌‌‌‌ వాడ్కర్ (102), హర్ష దూబే(65) ఆరో వికెట్ కు 130 పరుగులు జోడించి అద్భుతం చేసేలా కనిపించారు. ఈ క్రమంలో వాడ్కర్ తన సెంచరీని.. హర్ష దూబే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నారు. 

సెంచరీ తర్వాత అక్షయ్‌‌‌‌‌‌‌‌ వాడ్కర్ కొటియన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరగడంతో ఆ తర్వాత వచ్చిన విదర్భ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కేవలం 15 పరుగుల వ్యవధిలో ముంబై తమ చివరి 5 వికెట్లను కోల్పోయింది. అంతకముందు ముంబై తొలి ఇనింగ్స్ లో 224 పరుగులకు ఆలౌట్ కాగా.. విదర్భ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో ముంబై బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 418 పరుగులు చేసింది. 538 పరుగుల లక్ష్య ఛేదనలో విదర్భ 368 పరుగులకు ఆలౌటైంది. కొటియన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించగా.. ముషీర్ ఖాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.