
సీజన్ ప్రారంభంలో సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఎదురైన అవమానానికి రోహిత్ సేన ఓరేంజ్‌లో రివేంజ్ తీర్చుకుంది. ఢిల్లీ జట్టును వారి సొంతగడ్డపై ఓడిం చి లెక్క సరిచేసిం ది. పాండ్యా బ్రదర్స్ బ్యాటింగ్ షో కి రాహుల్ చహర్ (3/19) సూపర్‌స్పెల్ తోడవడంతో గురువారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన మ్యాచ్ లో ముం బై ఇండియన్స్ 40 రన్స్ తేడాతో ఢిల్లీపై గెలిచింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటిం గ్ చేసిన ముం బై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 168 రన్స్ చేసిం ది. క్రునాల్ పాండ్యా (26 బంతుల్లో 5ఫోర్లుతో 37 నాటౌట్ ) హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32) రాణిం చగా, ఢిల్లీ బౌలర్లలో రబాడ రెం డు వికెట్లు తీశాడు . ఛేజింగ్ లో పూర్తి ఓవర్లు ఆడిన ఢిల్లీ తొమ్మి ది వికెట్ల నష్టానికి 128 రన్స్ మాత్రమే చేసి ఓడిపోయిం ది. శిఖర్ ధవన్ (22బంతుల్లో 5 ఫోర్లు , 1 సిక్సర్ తో 35) టాప్ స్కో రర్ .మిగతా బ్యాట్స్‌మె న్ పూర్తిగా తేలిపోయారు. ముం బై బౌలర్లలో చహర్ కు మూడు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
చహర్ మ్యాజిక్….
ధనా ధన్ బ్యాటింగ్ తో శిఖర్ ధవన్ ఇచ్చిన ఆరంభాన్ని ఢిల్లీ వృథా చేసుకుంది. ముంబై స్పిన్నర్ల దెబ్బకు మిడిలార్డర్ పేకమేడలా కూలడంతో మ్యాచ్ చేజార్చుకుంది. తొలుత బౌండ్రీలతో ఖాతాలు తెరిచిన ఢిల్లీ ఓపెనర్లు ధవన్ , పృథ్వీ షా (20) ఛేజిం గ్ ను ధాటిగా ప్రారంభించారు. షా కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగా.. ధవన్ ప్రారంభం నుం చే ఎదురుదాడికి దిగాడు. రాహుల్ చహర్ వేసిన రెం డో ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టిన ధవన్ .. మలింగ బౌలింగ్ లో మరో రెండు బౌండరీలు బాదాడు. జయంత్ యాదవ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ వికెట్ నష్టపోకుం డా 48 రన్స్ చేసింది. యువ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ మ్యాజిక్ చేయడంతో పవర్ ప్లే తర్వాత ఢిల్లీ కథ మారిపోయింది. తన వరుస ఓవర్లలో ధవన్ , పృథ్వీని ఔట్ చేసిన చహర్ ఢిల్లీకి డబుల్ షాకిచ్చాడు. అక్కడి నుంచి హోమ్ టీమ్ బ్యాటిం గ్ గాడి తప్పింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. కొలిన్ మన్రో(3), కెప్టె న్ శ్రేయస్ అయ్యర్ (3), రిషబ్ పంత్(7) బ్లాట్లెత్తే శారు. మన్రోను క్రునాల్ బౌల్డ్ చేయగా..అయ్యర్ ను ఔట్ చేసిన చహర్ ప్రత్యర్థిని చావు దెబ్బతీశాడు. కొద్దిసే పటికే డేంజరస్ బ్యాట్స్‌మన్ పంత్ ను అద్బుతమైన బంతితో బౌల్డ్ చేసిన బుమ్రా ముంబై విజయాన్ని ఖాయం చేశాడు. ఈ దశలో క్రిస్ మోరిస్ (11), అక్షర్ పటేల్ (26) కాసేపు పోరాడే ప్రయత్నం చేసినా.. ముం బై బౌలర్లు వారికి ఎలాం టి చాన్స్ ఇవ్వలేదు. మోరిస్ ను మలిం గ ఔట్ చేయగా.. 18 ఓవర్ తొలి బంతికి కిమోపాల్(0)ను రనౌట్ చేసిన బుమ్రా తర్వాతి బంతికి అక్షర్ పటేల్(26)ను బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్లో రబాడ(9) వికెట్ ను హార్దిక్ ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్, డికాక్ మెరుపులు.. మిశ్రా మలుపు…
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి మెరుపు ఆరంభం దక్కింది. రోహిత్ –డికాక్ తొలి వికెట్ కు 57 పరుగులు జోడిం చి గట్టి పునాది వేశారు. తొలుత వీరిద్దరూ నింపాదిగా బ్యాటింగ్ చేసినా.. నాలుగో ఓవర్లో ముంబై ఇన్నింగ్స్ జోరందుకుంది. క్రిస్ మోరిస్ వేసిన ఆ ఓవర్లో రోహిత్ ఓ ఫోర్ కొట్టగా, డికాక్ 4,6తో వేగం పెంచాడు. కిమో పాల్ బౌలింగ్ లో ఇద్దరూ తలో సిక్సర్ కొట్టి ఊపులోకి వచ్చారు. పవర్ ప్లేలో ముం బై 57/0తో మెరుగైన స్థితిలో నిలిచింది. రోహిత్ , డికాక్ జోరు చూస్తుంటే ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించారు. కానీ, ఢిల్లీ స్పిన్నర్లు అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ రాకతో సీన్ రివర్సైం ది. పవర్ ప్లే తర్వాత బౌలింగ్ కు వచ్చిన మిశ్రా తన తొలి బంతికే రోహిత్ ను బౌల్డ్ చేసి ముం బై వేగానికి బ్రేకులేశాడు. తక్కువ ఎత్తు లో స్పిన్ అవుతూ వచ్చిన బంతిని బ్యాక్‌ఫుట్ పై ఆడే ప్రయత్నం లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యా డు.ఆ తర్వాత ఓవర్లో నే ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్ (2) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అక్షర్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. అతని తర్వాతి ఓవర్లోనే ముంబైకి మరో షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న డికాక్ లేని పరుగుకు యత్నించి రనౌటయ్యాడు. అప్పటికి పది ఓవర్లలో ముం బై స్కోరు 75/3. వెంటవెంటనే మూడు వికెట్లు పడడంతో సూర్యకుమార్ (26), క్రునాల్ పాండ్యా స్ట్ర యిక్ రోటేట్ చేస్తూ జాగ్రత్త గా ఆడడంతో 14 ఓవర్లకు గానీ రోహిత్ సేన స్కోరు వంద దాటలేకపోయింది.
పాం డ్యా బ్రదర్స్ షో…
నింపా దిగా బ్యాటిం గ్ చేస్తున్న సూర్యకుమార్ ను రబాడ ఔట్ చేయగా.. 17 ఓవర్లకు ముంబై 118/4తో నిలిచిం ది. ఈ క్కన ఆజట్టు 150 రన్స్ చేసినా గొప్పే అనిపించింది. కానీ, గూడ్స్ బండిలా సాగుతున్న ముంబై ప్రయాణానికి పాండ్యా సోదరులు ఊపుతెచ్చారు. అప్పటిదాకా నత్తనడకన బ్యాటింగ్ చేసిన క్రునాల్ తమ్ముడు క్రీజులోకి రాగానే జోరు పెంచాడు. కిమో పాల్ వేసిన 18వ ఓవర్ లో అతను ఫోర్ కొట్టగా.. హార్దిక్ 4,6 బాదాడు. ఆపై, మోరిస్ బౌలిం గ్ లో హార్దిక్ మరో సిక్సర్ , ఫోర్ కొట్టి స్కోరును 150 దాటించాడు. రబాడ వేసిన చివరి ఓవర్ రెండో బంతికి హెలికాఫ్టర్ షాట్ తో సిక్స్ కొట్టి న హార్దిక్ తర్వాత బంతికి భారీ షాట్ కు యత్నించి ఔటైనా.. వరుసగా రెండు ఫోర్లు బాదిన క్రునాల్ ముం బై ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చా డు.