
ముంబై: కరోనాతో బాధపడుతున్న ఓ మహిళా డాక్టర్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కలచివేస్తోంది. ఆ డాక్టర్ పేరు మనీషా జాదవ్. 51 ఏళ్ల మనీషా.. సెవ్రీలోని టీబీ ఆస్పత్రిలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా సేవలు అందిస్తున్నారు. రీసెంట్‌గా ఆమెకు కరోనా సోకింది. అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు. ‘ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఇకపై నేను మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. అందరూ జాగ్రత్తగా ఉండండి. దేహం చనిపోయినా, ఆత్మ బతికే ఉంటుంది. ఆత్మకు మరణం లేదు’ అని ఆ పోస్ట్‌లో మనీషా రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చేసిన మరుసటి రోజే ఆమె మృతి చెందారు.
May be last Good Morning. I may not meet you here on this plateform. Take care all. Body die. Soul doesnt. Soul is immortal ????
Posted by Manisha Jadhav on Saturday, April 17, 2021