RCB vs MI : బెంగళూరు టార్గెట్ 172

 RCB vs MI :  బెంగళూరు టార్గెట్ 172

బెంగళూరు వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్లో ముంబయి ఇండియన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి  171   పరుగులు చేసింది.  చివర్లో తిలక్‌ వర్మ దూకుడుగా ఆడాడు. హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి వచ్చిన ముంబయి జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (10), రోహిత్‌ శర్మ (1) తక్కువ పరుగులకే ఔటయ్యారు. ఆ తరువాత వచ్చిన కామెరూన్‌ గ్రీన్‌ (5) కూడా త్వరగానే వెనుదిరిగాడు. 

టీ20 కింగ్ అనిపించుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం తన ఫెయుల్యూర్ ఫర్ఫార్మెన్స్‌ ను కంటిన్యూ చేస్తున్నాడు. కేవలం 15 పరగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో స్కోర్ 50 దాటక ముందే ముంబయి జట్టు కీలకమైన నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో తిలక్‌ వర్మ వరుసగా సిక్సర్లు, ఫోర్లతో జట్టు స్కోర్ ను పెంచాడు.  అతడు చేసిన స్కోర్ వలనే ముంబయి ఈ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది. 

నిలకడగా ఆడిన తిలక్‌ 46  బంతులను ఎదురుకుని 84 పరుగులు చేశాడు.  అతడి ఇన్నింగ్స్ లో మొత్తం 9 ఫోర్లు, 4  సిక్సులున్నాయి. ఇక బెంగళూరు బౌలర్లలో కర్ణ్‌ శర్మ రెండు, హర్షల్‌ పటేల్, బ్రేస్‌వెల్‌ , ఆకాశ్‌ దీప్‌ , టాప్లీ, సిరాజ్‌ చెరో వికెట్ తీశారు